మొగిలేశ్వర స్వామి ఆలయ ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత స్వయంభు శ్రీ మొగిలేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని గ్రామస్థులు మంగళవారం ఆహ్వానించారు. అక్టోబర్ 1న జరగనున్న ఈ కార్యక్రమానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమలనాథరెడ్డి, మంజునాథ్, గిరిబాబు, సురేష్, వినయ్, బాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕