చిత్తూరులోని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇంటికి చేరుకున్న పలమనేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమర్నాథ రెడ్డికి ఆత్మీయ స్వాగతం లభించింది. స్థానిక నాయకులతో కలిసి అమర్నాథ్ రెడ్డి, గురజాల జగన్ మోహన్ కు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి ఆహ్వానించారు. అనంతరం, వారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో జిల్లా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.