పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎం.పీ ప్రకాష్

అణగారిన వర్గాల గొంతుక, మాదిగ జాతి ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం. పీ. ప్రకాష్ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని, సామాజిక న్యాయ పోరాటాన్ని దేశవ్యాప్తం చేసిన ఆయన నాయకత్వం అభినందనీయమని ఆయనకు పద్మశ్రీ దక్కడం మాదిగ జాతికి గర్వకారణమన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని, ఆయన లక్ష్యాలు సిద్ధింపజేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్