ఆలత్తూరులో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ

నగరి నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, ఆలత్తూరు గ్రామంలోని గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠంచడమైనది. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కూనమరాజుపాళెం గీతామందిర ఆశ్రమం పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామి చేతులమీదుగ యంత్రస్థాపన గావించారు. వేదపండితులు రూపేష్ క్రిష్ణ ఆచార్య ధ్వజారోహణం గావించారు.

సంబంధిత పోస్ట్

✕
✕