ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఆడి కృత్తిక (ఆషాఢమాసంలో) సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైన రోజు. ఆగష్టు 7, శుక్రవారం నాడు స్వామికి కావడిలు సమర్పించవచ్చు. ముందురోజు గురువారం భరణి కావడి సమర్పించాలని నగరి నియోజకవర్గం, కూనమరాజుపాళెం లోని వేదపండితులు రూపేష్ క్రిష్ణ ఆచార్య బుధవారం తెలిపారు. 7వ తేదీ సాయంత్రం 5.40 గంటల వరకు మాత్రమే కృత్తిక నక్షత్రం గడియలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 7న ఆడి కృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి కావడి సమర్పణ చేయాలి.