ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు తమ సీనియారిటీ జాబితాలోని అభ్యంతరాలను గురువారం సాయంత్రం లోపు తగిన ఆధారాలతో డీఈవో కార్యాలయంలో సమర్పించాలని డీఈవో లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. యాజమాన్యాల వారీగా సీనియారిటీ జాబితా ఎంఈవో, డీవైఈవో మెయిల్లో పొందుపర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలపై అభ్యంతరాలను తగిన ఆధారాలతో తెలియజేయాలని ఆయన కోరారు.