చిత్తూరులో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం

ఆదివారం, చిత్తూరు జిల్లా దర్గా సర్కిల్ సమీపంలోని టెలిఫోన్ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ మరియు చూడా చైర్మన్ కటారి హేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో నివారణ చుక్కలు వేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లాలోని ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్