గుడిపాల మండలంలో రీ-సర్వే విధులు నిర్వహిస్తున్న విలేజ్ సర్వేయర్ పాముకాటుకు గురైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. 190 రామాపురం రెవెన్యూ పరిధిలో రీ-సర్వే పనులు నిర్వహిస్తుండగా విలేజ్ సర్వేయర్ భవ్యను పాము కాటేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి భవ్యను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తూ ఆమెను పరిశీలనలో ఉంచారు. విషయం తెలుసుకున్న గుడిపాల తహసీల్దార్ పూజారి శ్రీనివాసులు, డీఐ కృష్ణమూర్తి, మండల సర్వేయర్ రామకృష్ణ, రీసర్వే డీటీ రూపాదేవి ఆసుపత్రికి వెళ్లి భవ్యను పరామర్శించారు. విలేజ్ సర్వేయర్లు హరీష్, పరిమళ, భవదీప్ లు ఉన్నారు.