ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 84 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి 84 ఫిర్యాదులను స్వీకరించారు. భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలు, ఆర్థిక వివాదాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕