తిరుపతి చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన మిథున్ రెడ్డి (10వ తరగతి విద్యార్థి) ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తుండగా ఉదయం లేవలేదు. వార్డెన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.