వెదురుకుప్పం: వర్షానికి కూలిపోయిన గుడిసెలు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలో అల్పపీడన ప్రభావంతో బొమ్మయ్య పల్లి గ్రామంలో కురిసిన వర్షానికి ఓ గుడిసె కూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు గిరి మాట్లాడుతూ తాను కట్టుకున్న ఇల్లు పడిపోవడంతో ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

సంబంధిత పోస్ట్