కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ లావణ్య బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కాలేజీలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఆమెకు వీడ్కోలు పలికారు. ఆమెను పలువురు సన్మానించారు. లావణ్య సేవలు ఎనలేనివని ప్రిన్సిపల్ డాక్టర్ విజయులు రెడ్డి అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.