గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన చెంగల్రాయన్ కుమారుడు పెరియ స్వామి (46) ఆదివారం రాణిపేట సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం రాత్రి నీవానది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరియస్వామి తలకు బలమైన గాయం అయింది. బాధితుడు జైన్ ఫ్యాక్టరీలో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతడికి నలుగురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.