తండ్రిని గొంతు కోసి చంపిన కొడుకు

మద్యం తాగి ఇంటికి వచ్చిన తనను చూసి తండ్రి నవ్వాడని ఆగ్రహించిన కుమారుడు కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం రాత్రి పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లె పంచాయతీ పరిధి మాణిక్యరాయునిపల్లెలో చోటు చేసుకుంది. పెనుమూరులో నివసిస్తున్న జోకేష్ రెడ్డి అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి భార్యను వేధిస్తుండటంతో ఆమె మాణిక్యరాయునిపల్లెలో ఉన్న తన భర్త తండ్రి చెంగారెడ్డికి ఫోన్ చేసి మీ కొడుకు తాగొచ్చి గొడవ చేస్తుండు వచ్చి తీసుకెళ్లండని అని చెప్పింది. అనంతరం నిందితుడు తండ్రి వద్దకు వెళ్లగా తండ్రి నవ్వడంతో కోపంతో గొంతు కోసి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్