గంగాధర నెల్లూరు మామిడి ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం జిల్లా వైసిపి అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని వైసీపీ నేతలు మంగళవారం భారీ నిరసన చేపట్టారు. రూ. 4 కేజీకి ధర నిర్ణయించడంతో గత రెండు రోజులకు ముందు రైతులు ఫ్యాక్టరీ ముందు మామిడికాయలు పోసి నిరసన తెలిపారని గుర్తు చేశారు. రైతు పక్షాన నిలబడేది వైసీపీ మాత్రమేనని కరుణాకర్ రెడ్డి అన్నారు. రైతు కన్నీరు తుడవాలంటే రూ. 15 మద్దతు ధర ప్రకటించాలని భూమన డిమాండ్ చేశారు.