చిల్లకూరు మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు మేరకు. ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరుణాచల శైవ క్షేత్ర దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారు నెల్లూరు నగరం వనంతోపు సెంటర్ కు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.