ఘనంగా ఆకాశ దీపోత్సవం

గూడూరు మండలం కొండకూరు సమీపంలోని కనుమ రాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఆకాశ దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని ఆకాశదీపాన్ని వెలిగించి ధ్వజ స్తంభానికి అలంకరించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేసి ప్రత్యేక పూజల అనంతరం ఈ దీపోత్సవాన్ని ధ్వజస్తంభంపై ఉంచారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕