గూడూరు: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

మనుబోలు మండలం కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడా, లేక ప్రమాదవశాత్తు చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉందని తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా గుర్తించలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకటరావు, ఎస్ఐ శివ రాకేశ్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్