గూడూరు: ఆటోపై కూలిన విద్యుత్ స్తంభం

దిత్వా తుపాను ప్రభావంతో గూడూరు మండలంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని విందూరులో ఒక ఆటోపై విద్యుత్ స్తంభం కూలింది. ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్