గూడూరులో భారీ వర్షం

తిరుపతి జిల్లా గూడూరు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు ఈ వర్షం కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం వల్ల స్థానిక చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. సుదీర్ఘ కాలం వేచి చూసిన వర్షం రాకతో గూడూరు ప్రాంతమంతా చల్లబడింది.

సంబంధిత పోస్ట్

✕
✕