గూడూరు-ఓడూరు మధ్య కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

గూడూరు నియోజకవర్గంలోని ఓడూరు గ్రామం నుంచి గూడూరుకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును సోమవారం ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ బస్సు పున్నపువారిపాలెం, నెలబల్లి, రెట్టపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కొత్త బస్సు సర్వీస్‌తో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలకు ప్రయాణ సౌలభ్యం మరింత పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్