రవాణా శాఖ వారిచే తనిఖీలు నిర్వహించి నిర్భంధించిన వాహనములలో ఇప్పటివరకు విడుదల చేసుకోకుండా వేంకటగిరి, గూడూరు ఆర్టీసీ డిపోలలో ఉన్న వాహనాలను ఈ నెల 18వ తేదీ గూడూరు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో వేలం వేయబడునని గూడూరు రవాణా అధికారి కిషోర్ మంగళవారం తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడారు. వేలంలో పాల్గొనదలచిన వారు 5వేలు రూపాయల నగదును చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు.