నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ దంపతులకు శనివారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జేసీ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్ మరియు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.