ఐరాల: నర్సుపై దాడి

ఐరాల ప్రభుత్వాసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీరప్ప చెరువుకు చెందిన శకుంతల స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. బుధవారం ఆమె విధుల్లో ఉండగా నవీన్‌ మరికొందరు చికిత్స కోసం వెళ్లారు. అప్పుడు ఆమె మరొకరికి చికిత్స చేస్తుండగా ఆ రోగికి చికిత్స నిలిపేసి తమకు వెంటనే చికిత్స చేయాలని కోరాడు. దానికి ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో దాడి చేశాడు. ఆమెను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్