చిత్తూరు జిల్లా కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. స్వర్ణ కుప్పం విజన్–2029లో భాగంగా రూ. 9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో కుప్పంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమైందని, ఇప్పటికే 8 పరిశ్రమలు ప్రారంభమవగా మరో 12 పరిశ్రమలకు శంకుస్థాపన జరిగిందని, తద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని అన్నారు.