మంచి ప్రభుత్వం లోగో ఆవిష్కరణ

కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు కమిషనర్ వార్డు బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నేతలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వినతులను చూసి, వాటిలో చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి వందరోజుల పాలనను పూర్తి చేసుకోవడంతో ప్రభుత్వ ఆదేశానుసారం మంచి ప్రభుత్వం లోగో ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్