ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పులిమడుగు కొత్తూరు తాండ గ్రామంలో చంద్రబాబు తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటు సమాజ భవిష్యత్తును, పరిపాలనను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. యువత, మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగులతో సహా అర్హులందరూ ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕