కుప్పం: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని మఠం జూనియర్ కళాశాల వద్ద ఆదివారం బైక్ ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. శాంతిపురం మండలంలోని వేటగిరి కొత్తూరు గ్రామానికి చెందిన జయరామప్ప శాంతిపురం నుంచి వీకోట వైపు బైక్ వెళ్తూ వృద్ధుడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. రాళ్ల బూదుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్