కుప్పం: టిడిపిలోకి చేరిక

కుప్పం మండల పరిధిలోని ఊర్లఓబనపల్లి పంచాయతీకి చెందిన సుమారు 150 మంది బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ శరవణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్