చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక అదృశ్యమైనట్లు రామకుప్పం పోలీసులు సోమవారం తెలిపారు. వారం నుంచి మైనర్ బాలిక కనిపించక పోవడంతో చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.