కుప్పం: తండ్రిని హతమార్చిన కొడుకు

రామకుప్పం మండల పరిధిలోని ననియాల గ్రామంలో తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మద్యం సేవించి వేధిస్తున్నాడంతో కుమారుడు షణ్ముగం తాడుతో హతమార్చినట్లు సమాచారం. సమాచారం అందుకున్న కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్