కుప్పం: ఎమ్మెల్సీ భరత్ పై వైసీపీ నేత ఫైర్

తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కుప్పం నియోజకవర్గ వైసీపీ మైనారిటీ అధ్యక్షుడు సర్దార్ బాషా మంగళవారం మండిపడ్డారు. పార్టీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఎమ్మెల్సీ భరత్ చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. భరత్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటలో లేరని మండిపడ్డారు. కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, ఆయన ఏ రోజూ పట్టించుకోలేదని ధ్వజమొత్తారు.

సంబంధిత పోస్ట్