కట్నం వేధింపులతో వివాహిత మృతి ?

రామకుప్పం మండల కేంద్రానికి చెందిన మనోజ్ఞకు 2020లో కర్ణాటకలోని ములబాగల్‌కు చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. మంగళవారం ఆమె ఇంట్లోనే మృతి చెందింది. కట్నం కోసం భర్త, అత్త వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఉదయం ఇంట్లో గొడవ జరిగిన అనంతరం మనోజ్ఞ కేకలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై ములబాగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్