జీడి నెల్లూరు: బండమీద ఇండ్లలో బీభత్సం సృష్టించిన పిడుగు

ఓ ఇంటిపై పిడుగు పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు వెదురు కుప్పం మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మొండి వెంగళపల్లి పంచాయతీ, బండమీద ఇంట్లో గ్రామానికి చెందిన గంగాధరం ఇంటిపై పిడుగు పడి ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న 50 బస్తాల వరి, ఐదు బస్తాల వేరుశెనగ, 50 కేజీల బియ్యం పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్