రామకుప్పం మండలం పల్లి కుప్పం గ్రామంలో ఆదివారం పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు జరుగుతుందని, ప్రాణాంతకమైన పోలియో వ్యాధిని అరికట్టి, పక్షవాతం, అంగవైకల్యం రాకుండా కాపాడతారని తెలిపారు. ఇది వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఏఎన్ఎం కవిత, ఆశా వర్కర్ వి పుష్ప, ఏ డబ్ల్యూ రూప, భారత్మమ్మ పాల్గొన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు పిల్లల భవిష్యత్తుకు భరోసా అని తెలిపారు.