మదనపల్లెలో దంచి కొట్టిన వర్షం

మదనపల్లెలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమి, ఉక్క పోతలతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు కమ్మి వర్షం దంచి కొట్టింది. సుమారు అరగంట పాటు విడవకుండా పడటంతో పట్టణంలోని చిరు, కూరగాయల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించిందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్