నగరిలో శ్రీ మహాలక్ష్మీ దేవాలయంలో అన్నమాచార్య సంకీర్తనలు, హరికథతో భక్తి పారవశ్యం

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం సాయంత్రం జేష్ఠ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, అన్నమాచార్య సంకీర్తనలు నిర్వహించారు. భాగవతారిణి శ్రీమతి అనురాధ, ఆనంద్ రెడ్డి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు, కుప్పుస్వామి, విద్యాదర్ సహకారంతో భక్తులలో ఆనందాన్ని, భక్తి భావాన్ని నింపాయి. దేవస్థానం అధికారులు టీటీడీ సహకారాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్