విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు మంగళవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కొట్టె జయకుమార్ చైర్మన్ గా పద్మజ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ జయకుమార్, వైస్ చైర్మన్ పద్మజ, సభ్యులు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.