విజయపురం మండలం మల్లారెడ్డి కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సి. లావణ్య చైర్మన్గా, కె. సంధ్య వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన చైర్మన్ లావణ్య, వైస్ చైర్మన్ సంధ్య, సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.