నగరి: గీతామందిరంలో ఘనంగా శ్రీ కృష్ణుడికి విశేష పూజలు

నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం, కూనమరాజుపాళెంలో వున్న గీతామందిర ఆశ్రమంలో శనివారం శ్రీ కృష్ణుడికి విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ గావించి ఫలపుష్పాలు సమర్పణ చేశారు. నైవేద్యానంతరం గీతాశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పంచహారతులు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులందరూ కలసి హరినామ సంకీర్తన గానం చేశారు.

సంబంధిత పోస్ట్