లారీ ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి చెందిన విషాద ఘటన విజయపురం మండలంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు నగిరి నియోజకవర్గం నిండ్ర(మం), అగరం పేట గ్రామానికి చెందిన రవి (48), కెవిబి పురం(మం), కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44) అన్నాచెల్లెళ్లు. వారు పెద్ద అక్క దేశమ్మ ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ప్రయాణంలో ఉన్నదా తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.