నగరి పరిధిలోని నెత్తం కండ్రిగ ఎస్టీ కాలనీ వాసులు కొన్ని సంవత్సరాల నుంచి తాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పరిష్కారం చూపారు. రూ. 4. 50 లక్షలతో కాలనీలో బోర్ వేయించి మోటార్ బిగించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానికులు మాట్లాడుతూ తమ సమస్య తీర్చిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు.