నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలం న్యూ ఎన్జీవో కాలనీ వద్ద శనివారం ఓ ఇంట్లో రక్తపింజరి పాము బుసలుకొట్టి ఆ ఇంట్లో వారినే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా భయభ్రాంతులకు గురిచేసింది. దీనితో స్థానికులు స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న శ్రీకాంత్ చాకచక్యంగా ఆ పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ తమకు పాముల బెడద తప్పడం లేదని తెలిపారు.