నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని ఈసలాపురం వాటర్ వాష్ సర్వీస్ పాయింట్ దగ్గర ఆదివారం భారీ కొండచిలువ కలకలం రేపింది. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు స్థానికులు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న శ్రీకాంత్ వెంటనే కొండ చిలువను పట్టుకొని స్థానిక అటవీ ప్రాంతంలో వదిలేశారు. పుత్తూరు పట్టణంలో ఈమధ్య కొండ చిలువలు ఎక్కువగా వస్తుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.