వ్యవసాయ కూరగాయల మార్కెట్ నుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తుల అన్నదానానికి పలమనేరు నుంచి 3 టన్నుల కూరగాయలను తరలించారు. టీటీడీ కూరగాయల డోనర్ కాపు పల్లి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ఆర్ మండి యజమాని కందప్పరెడ్డి కుమారుడు రాజారెడ్డి ఈ కూరగాయలను అందించారు. కాణిపాకం ఆలయ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కూరగాయలను తరలించారు. స్వామి సేవకులు కాంతారాం, వేణుగోపాల్, బాబు తదితరులు పాల్గొన్నారు.