చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామంలో టిప్పర్, టూవీలర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహమ్మద్(28), బాబు(30) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రఫిక్(25) ని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాదం నెలకొంది.