పలమనేరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఆర్ఏల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.