పలమనేరులో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్‌రావు డాక్టర్ ఎస్. సుశీలను శాలువా, మహారాజా క్యాబ్ మెడల్‌తో బుధవారం సత్కరించారు. గత 30 ఏళ్లుగా కేవలం రూ. 30 ఔట్‌పేషెంట్ ఫీజుతో ప్రజలకు అందుబాటు వైద్య సేవలు అందిస్తూ, తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్న డాక్టర్ సుశీల సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుశీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.