పలమనేరులోని ఎస్‌వీసీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఆర్. ఎస్. రహమతుల్లా ఆధ్వర్యంలో ఉర్దూ ఘజల్‌పై జాతీయ సెమినార్ ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటేశులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ భాషా, సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం చేశారు. పలమనేరు పట్టణానికి చెందిన శ్రీపురం సీతారామయ్య, డాక్టర్ సుశీలతో పాటు పలమనేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిని ఘనంగా సన్మానించారు. కవులు ఉర్దూ ఘజల్స్, కవితలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.