పలమనేరు: మేలుమాయి క్రాస్ వద్ద ఆటో బోల్తా

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని మేలుమాయి క్రాస్ వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. మేలుమాయి క్రాస్ వద్ద బైకును తప్పించబోయి గుంతలో వెళ్లడంతో ఆటో బోల్తా పడినట్లు ఆటో డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్